'చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం’ పేరిట రౌండ్ టేబుల్ సమావేశం

  • తుళ్లూరులో జరుగుతున్న సమావేశం
  • రాజధాని రైతులు, రైతు కూలీలు, వైసీపీ ఎమ్మెల్యేల హాజరు
  • టీడీపీ హయాంలో తమకు అన్యాయం జరిగిందన్న రైతులు
రాజధాని రైతులు, కూలీల రౌండ్ టేబుల్ సమావేశం తుళ్లూరులో జరుగుతోంది ‘చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం’ పేరిట నిర్వహిస్తున్న ఈ సమావేశానికి రైతులు, రైతు కూలీలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, జోగి రమేశ్, బీజేపీ, సీపీఐ నేతలు, దళిత, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. టీడీపీ హయాంలో తమకు జరిగిన అన్యాయాన్ని రౌండ్ టేబుల్ సమావేశం దృష్టికి రైతులు తీసుకెళ్లారు. రాజధాని పేరిట చంద్రబాబు తమకు అన్యాయం చేశారని, అందుకే, చంద్రబాబు ఇటీవల పర్యటించినప్పుడు నిరసనలు వ్యక్తం చేశామని రైతులు పేర్కొన్నారు.

చంద్రబాబు బంధువులకు కూడా రాజధానిలో భూములు ఉన్నాయని, ఈ భూములను టీడీపీ నేతలు తమ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. రైతులను చంద్రబాబు మోసం చేశారని, ల్యాండ్ పూలింగ్ పేరుతో అవినీతికి పాల్పడ్డారని రైతు సంఘం నేత శేషగిరిరావు ఆరోపించారు. సీఆర్డీఏలో ఎన్నో అవకతవకలు జరిగాయని, రైతులకు చంద్రబాబు చేసిన అన్యాయాన్ని మరచిపోమని అన్నారు. రాజధాని పేరుతో రూ.58 వేల కోట్లు దోచేశారని ఆరోపించిన శేషగిరిరావు, రైతులకు న్యాయం జరగాలని కోరారు.
Go Back to Shorts
Amaravathi
Tullur
Farmers
Round table
meet

More Telugu News