ఇక ఈ దేశ ఆర్థిక వ్యవస్థను దేవుడే కాపాడాలి!: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం
- జీడీపీ గణాంకాలు వ్యవస్థ వృద్ధికి సంకేతాలు కాదు
- లోక్ సభలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే
- తీవ్రంగా ఖండించిన మాజీ ఆర్థిక మంత్రి
కాగా, ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం, జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ 4.5 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఇకపై జీడీపీ గణాంకాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించిన దూబే, 1934 కన్నా ముందు ఏ జీడీపీ గణాంకాలు ఉన్నాయని ప్రశ్నించారు. ప్రస్తుతం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో రిమాండ్ ఖైదీగా తీహార్ జైల్లో ఉన్న చిదంబరం ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూ, సంస్కరణల అమలు దిశగా బీజేపీ ఏమీ చేయడం లేదని విమర్శలు గుప్పించారు.