మహిళలను పూజించక్కర్లేదు కానీ ఇలాంటి ఘటనలకు మాత్రం పాల్పడకండి: పార్లమెంటులో వంగా గీత ఆవేదన
- దిశ ఘటనపై పార్లమెంటులో ప్రసంగించిన వంగా గీత
- రాజకీయాలకు అతీతంగా చూడాలంటూ విజ్ఞప్తి
- కఠినచట్టాలు తీసుకురావాలంటూ వ్యాఖ్యలు
మహిళలను మహిళల్లాగా బతకనివ్వండి, మమ్మల్ని పూజించకపోయినా ఫర్వాలేదు, ఇలాంటి ఘటనలకు మాత్రం పాల్పడకండి, మా స్వేచ్ఛను హరించకండి అంటూ తీవ్ర భావోద్వేగాలతో ప్రసంగించారు. మహిళలను పూజిస్తామని చెప్పుకునే దేశంలో నేడు ఓ ఆడపిల్లను స్కూలుకు పంపాలంటే భయాందోళనలు కలుగుతున్నాయని తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర రాష్ట్రాలతో కలిసి అత్యాచార ఘటనలను అరికట్టేలా కఠినమైన చట్టాలు తీసుకురావాలని వంగా గీత విజ్ఞప్తి చేశారు.