భారత్ వృద్ధి అంచనా 7%.. ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ ప్రశంసలు
- 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను 7 శాతానికి పెంచిన ఐఎంఎఫ్
- పటిష్ఠమైన దేశీయ డిమాండ్, సేవల రంగమే వృద్ధికి కారణమని వెల్లడి
- ఇటీవలే ఆర్‌బీఐ కూడా వృద్ధి అంచనాను 7.1 శాతానికి పెంచిన వైనం
- ప్రపంచ ఉద్రిక్తతలున్నా భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ఐఎంఎఫ్ ప్రశంస
- 2027-28లో కూడా వృద్ధి 7 శాతంగానే ఉంటుందని తాజా నివేదికలో అంచనా
భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రశంసల వర్షం కురిపించింది. దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాను భారీగా పెంచుతూ కీలక ప్రకటన చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని తన తాజా నివేదికలో పేర్కొంది.
గత జులైలో ఈ అంచనా 6.4 శాతంగా ఉండగా, దానిని ఇప్పుడు సవరించింది. దేశంలో అంచనాలకు మించి కనిపిస్తున్న బలమైన ఊపు, పటిష్ఠమైన దేశీయ డిమాండ్, సేవల రంగంలో అద్భుతమైన పనితీరు కారణంగానే ఈ అంచనాలను పెంచుతున్నట్లు ఐఎంఎఫ్ వివరించింది.
ప్రపంచ ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్ పనితీరు ప్రత్యేకంగా నిలుస్తోందని ఐఎంఎఫ్ తన ‘వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్’ నివేదికలో పేర్కొంది. "అనుకూల జనాభా, వేగంగా విస్తరిస్తున్న దేశీయ మార్కెట్, కొనసాగుతున్న నిర్మాణాత్మక సంస్కరణల మద్దతుతో భారత్ వృద్ధి సామర్థ్యం బలంగా కనిపిస్తోంది. అందుకే అంచనాలను సవరిస్తున్నాం" అని తెలిపింది. అంతేగాక 2027-28 ఆర్థిక సంవత్సరానికి కూడా జీడీపీ వృద్ధి అంచనాను 6.7 శాతం నుంచి 7 శాతానికి పెంచింది.
అమెరికా-ఇరాన్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాల వంటి ప్రపంచ ఉద్రిక్తతల నేపథ్యంలో కూడా భారత్ వృద్ధి అంచనాలను పెంచడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధిక చమురు ధరల ప్రభావం ఉన్నప్పటికీ, దేశీయ డిమాండ్, సేవల రంగం మద్దతుతో భారత్ వృద్ధి బలంగా ఉందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. ఇటీవలే ఆర్‌బీఐ కూడా ఈ ఏడాదికి జీడీపీ వృద్ధి అంచనాను 7.1 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.