తెలంగాణ యాసపై చైతూ కసరత్తు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ యాసపై చైతూ కసరత్తు

  • చైతూ తాజా చిత్రంగా 'వెంకీమామ'
  • నెక్స్ట్ మూవీ శేఖర్ కమ్ములతో 
  •  చైతూ జోడీగా సాయిపల్లవి 
చైతూ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'వెంకీమామ' సిద్ధమవుతోంది. ఈ నెలలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విడుదల తేదీపై త్వరలో స్పష్టత రానుంది. ఇక తన తదుపరి సినిమాను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ చేస్తున్నాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా శేఖర్ కమ్ముల ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.

ఈ సినిమాలో చైతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన పల్లెటూరి కుర్రాడిగా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన తెలంగాణ యాసలో మాట్లాడటం నేర్చుకుంటున్నాడట. పెర్ఫెక్షన్ కోసం ఆయన గట్టిగానే కష్టపడుతున్నాడని అంటున్నారు. ఆయన సరసన నాయికగా సాయిపల్లవి నటిస్తోంది. తెలంగాణ ప్రాంతంలోని వేరు వేరు గ్రామాల నుంచి హైదరాబాద్ వచ్చిన యువతీ యువకులుగా వాళ్లు కనిపించనున్నారని అంటున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
Nagachaianya
Sai pallavi

More Telugu News