మధ్యాహ్న భోజన నాణ్యత దెబ్బతినకూడదు: సీఎం జగన్

  • అధికారులతో సీఎం జగన్ సమీక్ష
  • పాఠశాల నిర్వహణలో తల్లిదండ్రుల కమిటీలకు భాగస్వామ్యం
  • సకాలంలో పుస్తకాలు, దుస్తులు, బ్యాగులు, పాదరక్షలందించాలని ఆదేశం
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యత దెబ్బతినకూడదని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఈ రోజు సీఎం మధ్యాహ్న భోజన పథకం అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్న భోజన బకాయిలు లేకుండా చూస్తున్నామని చెప్పారు. నాడు-నేడు, పాఠశాల నిర్వహణలో తల్లిదండ్రుల కమిటీలకు భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. పాఠశాలలు తెరిచేనాటికి అన్ని వస్తువులను అందించాలని చెప్పారు. ఇందులో భాగంగా విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు, దుస్తులు, బ్యాగులు, పాదరక్షలు ఇవ్వాలన్నారు. అంతేకాక, ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త పాఠ్య ప్రణాళిక తయారీ అంశంపై సీఎం చర్చించారని తెలుస్తోంది.
Go Back to Shorts
Midday meals scheme review CM Jagn
Andhra Pradesh

More Telugu News