రేపే బల పరీక్ష నిర్వహించండి: మహారాష్ట్రపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- సాయంత్రం గం. 5 లోగా బల పరీక్ష
- సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆలస్యం ఏంటి
- అసెంబ్లీ సమావేశాలను లైవ్ లో చూపాలని సుప్రీం ఆదేశాలు
బల పరీక్షను సజావుగా నిర్వహించేందుకు ప్రొటెమ్ స్పీకర్ ను తక్షణమే నియమించాలని, మొత్తం అసెంబ్లీ సమావేశాలను చిత్రీకరిస్తూ, లైవ్ టెలికాస్ట్ చేయాలని కూడా ఆదేశించించింది. రేపు ఉదయం నుంచి సాయంత్రంలోగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తి కావాలని, ఆ వెంటనే బల పరీక్ష జరపాలని ఆదేశాలు జారీ చేసింది. బల పరీక్షలో రహస్య ఓటింగ్ ను జరపరాదని కూడా సూచించింది.