మహారాష్ట్రలో బీజేపీ నైతికంగా, రాజకీయంగా గెలిచింది: కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్
- కాంగ్రెస్ పార్టీయే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది
- మహారాష్ట్రలో బీజేపీ, శివసేనకు మద్దతుగా ప్రజలు తీర్పునిచ్చారు
- బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నివీస్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు
- దీనిపై కాంగ్రెస్ తిరిగి మమ్మల్నే ప్రశ్నిస్తోంది
'కాంగ్రెస్ పార్టీయే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. మహారాష్ట్రలో ప్రజాస్వామ్య వ్యతిరేకపూరిత ధోరణితో వ్యవహరించడమే గాక దీనిపై మమ్మల్నే ప్రశ్నిస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ నైతికంగా, రాజకీయంగా గెలిచింది. కాంగ్రెస్ మాత్రం మహారాష్ట్రను తప్పుడు పద్ధతిలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది' అని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.