ఆదివారం వాదనలు వినకూడదన్న బీజేపీ తరఫు న్యాయవాది.. ఇది ప్రధాన న్యాయమూర్తి విచక్షణాధికారమన్న జస్టిస్ భూషణ్
- గవర్నర్ తరఫున ఎవరు వాదిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్న
- తమకు తెలియదన్న సొలిసిటర్ జనరల్
- ఈ పిటిషన్ ను అంగీకరించకూడదని విజ్ఞప్తి
దీంతో ఆదివారం విచారణ అనేది ప్రధాన న్యాయమూర్తి విచక్షణాధికారమని జస్టిస్ భూషణ్ తెలిపారు. గవర్నర్ తరఫున ఎవరు వాదిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా.. ఈ విషయం తెలియదని చెప్పారు. శివసేన కూటమికి ప్రభుత్వ ఏర్పాటు చేసే హక్కులేదని, ఈ పిటిషన్ ను అంగీకరించకూడదని ఆయన కోరారు.