భర్తను చంపి వంట గదిలో పాతిపెట్టిన భార్య!
- ఎప్పటిలాగా వంటచేసుకుంటూ జీవనం
- కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు
- దర్యాప్తులో మృతుడి జాడ కనిపెట్టిన పోలీసులు
ఈ నేపథ్యంలో ప్రమీల ఇంటిని తనిఖీ చేస్తున్న సమయంలో, వంటగదిలోంచి దుర్వాసన రావడంతో అనుమానంతో అక్కడ తవ్విచూడగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహేశ్ శవాన్ని గుర్తించి వెలికి తీశామన్నారు. అనంతరం ప్రమీలను తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకుందని తెలిపారు. మహేశ్ పెద్దన్న గంగారం బన్వాల్ ఈ హత్య చేయడానికి తనకు సహాయం చేశాడని నిందితురాలు పేర్కొందన్నారు. గంగారం భార్యతో మహేశ్ కు అక్రమ సంబంధం ఉందని, ఈ నేపథ్యంలో మహేశ్ హత్యకు అతనితో కలసి పథకం వేసి, అమలు చేశానని ప్రమీల చెప్పిందన్నారు. ప్రమీలను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.