హైదరాబాద్ లోని ఓ పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్.. పోలీసులకు ఫిర్యాదు
- గుర్తించిన శ్రీనాథ్ అనే వ్యక్తి
- పెట్రోల్ బంకు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం
- కూకట్ పల్లిలోని హెచ్ పీ పెట్రోల్ నిర్వాహకులపై ఫిర్యాదు
కూకట్ పల్లిలోని హెచ్ పీ బంకులో పెట్రోల్ పోయించుకునేందుకు వెళ్లగా కల్తీ పెట్రోల్ పోశారని శ్రీనాథ్ వాపోయాడు. దీనిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరాడు. వినియోగదారులతో ఆ పెట్రోల్ బంకు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.