భారత విమానాన్ని ప్రమాదం నుంచి కాపాడిన పాక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్!

16-11-2019 Sat 17:00 | International
  • మెరుపుల తాకిడికి లోనైన భారత విమానం
  • విమానాన్ని పాక్ గగనతలంలోకి అనుమతించిన ఏటీసీ
  • సురక్షితంగా గమ్యం చేరిన విమానం
ఆర్థికంగా ఎంతో నష్టదాయకం అని తెలిసి కూడా భారత్ పై అక్కసుతో పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే, ఓ పాకిస్థానీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆపదలో ఉన్న భారత విమానం పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. జైపూర్ నుంచి ఒమన్ దేశానికి వెళుతున్న ఓ విమానం పాక్ గగనతలం సమీపం నుంచి వెళుతుండగా, మెరుపుల తాకిడికి గురైంది. దాంతో 36 వేల అడుగుల ఎత్తులో వెళుతున్న విమానం కాస్తా ఒక్కసారిగా రెండు వేల అడుగులు కిందికి జారిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన పైలెట్ వెంటనే "మేడే మేడే" అంటూ ఎమర్జెన్సీ సందేశం పంపాడు.

ఈ ప్రమాద సంకేతాలను పాకిస్థాన్ లోని ఓ ఎయిర్ పోర్టు సిబ్బంది గుర్తించారు. వెంటనే అక్కడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించి, సదరు భారత విమానానికి దిశానిర్దేశం చేశారు. ఆ విమానాన్ని పాక్ గగనతలంలోకి అనుమతించడం ద్వారా మెరుపుల ప్రభావం నుంచి రక్షించగలిగారు. తద్వారా ఆ విమానం ముప్పు నుంచి బయటపడి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది. కాగా, ఈ విమానంలో 150 మంది ప్రయాణికులున్నారు. పుల్వామా దాడి తర్వాత భారత్ వైమానిక దాడులు నిర్వహించినందుకు బదులుగా పాక్ తన గగనతలాన్ని మూసివేసింది.
IndiaPakistanATC

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more