చంద్రబాబుకు దమ్ముంటే బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించాలి: వల్లభనేని వంశీ

  • బీజేపీలో నలుగురు టీడీపీ ఎంపీలు చేరారు
  • టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడాన్ని నిరసించారా?
  • వారిపై దీక్ష చేసే దమ్ముందా చంద్రబాబుకు?
టీడీపీ నుంచి తనను సస్పెండ్ చేయడం కాదు, చంద్రబాబునాయుడుకు దమ్ముంటే బీజేపీలో చేరిన తెలుగుదేశం పార్టీ నలుగురు ఎంపీలతో రాజీనామా చేయించాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీలో నలుగురు టీడీపీ ఎంపీలు చేరడాన్ని నిరసిస్తూ వారిపై దీక్ష చేసే దమ్ముందా చంద్రబాబునాయుడుకి? చంద్రబాబు నిజంగా నిజాయతీ కలవాడైతే, దమ్ముంటే వారితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

మోదీ లేదా అమిత్ షా వద్దకు చంద్రబాబు వెళ్లి తమ పార్టీ ఎంపీలు బీజేపీలో చేరారు, వారితో రాజీనామా చేయించాలని అడగాలని సూచించారు. టీడీపీలో ఇంకా ఇబ్బంది పడే ఎమ్మెల్యేలు ఉన్నారా? అన్న ప్రశ్నకు వంశీ బదులిస్తూ, ఈ విషయమై తాను కామెంట్ చేయడం బాగుండదని, సమయం వచ్చినప్పుడు ఆ విషయం తెలుస్తుందని చెప్పారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Vallabhaneni Vamsi
mla

More Telugu News