రంజుగా మారిన ‘మహా’ రాజకీయం.. సోనియాగాంధీతో కోర్‌కమిటీ సమావేశం
- శివసేనకు మద్దతు విషయంలో తేల్చుకోలేకపోయిన కాంగ్రెస్
- ఈ ఉదయం పది గంటలకు సోనియా నివాసంలో సమావేశం
- సమావేశం అనంతరం నిర్ణయాన్ని ప్రకటించనున్న ఎన్సీపీ
దీంతో మిత్రపక్షమైన ఎన్సీపీ నేతలతో నేడు సమావేశమై తాజా పరిణామాలను చర్చించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మద్దతు విషయమై ఈ రోజు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నేతలు పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ అభిప్రాయం ఏమిటో స్పష్టమైన తర్వాతే ఎన్సీపీ తన నిర్ణయాన్ని వెల్లడిస్తుందని ఆ పార్టీ నేతలు తెలిపారు.
మరోవైపు, తమకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు రాని కాంగ్రెస్‌కు శివసేన ఎందుకు మద్దతు ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాబట్టి ఏ రకంగా చూసినా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు లేవని తెగేసి చెబుతున్నారు. సాయంత్రం వరకు వేచి చూసి ఆ తర్వాత రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.