మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు నేడు గవర్నర్ సిఫారసు?
- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని చెప్పేసిన బీజేపీ, శివసేన
- ఎన్సీపీని ఆహ్వానించి 24 గంటలు గడువిచ్చిన గవర్నర్
- నేటి సాయంత్రానికి స్పష్టమైన వైఖరి
అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎన్సీపీకి కూడా కష్టసాధ్యమే. ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే శివసేన, కాంగ్రెస్ సహకరించాలి. అది దాదాపు అసాధ్యం కావడంతో ఈ ప్రయత్నం కూడా విఫలం కావడం తథ్యంగా కనిపిస్తోంది. అతిపెద్ద పార్టీలుగా అవతరించిన మూడు పార్టీలకు అవకాశం ఇచ్చిన గవర్నర్.. చివరగా రాష్ట్రపతి పాలనకు కేంద్రాన్ని సిఫారసు చేయనున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.