ఢిల్లీకి రండి.. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలకు మల్లికార్జున ఖర్గే పిలుపు!
- ముగిసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
- సాయంత్రం 4 గంటలకు మహరాష్ట్ర నేతలతో భేటీ
- మహారాష్ట్రలో అనుసరించాల్సిన వైఖరిపై చర్చ
కాగా, మహారాష్ట్రలో శివసేనకు మద్దతు ఇచ్చే విషయంపై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీతో కలవకూడదని కొందరు నేతలు బలంగా తమ వాదన వినిపిస్తున్నారు. కాగా, రెండో అతిపెద్ద పార్టీగా శివసేనను ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించిన గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి.. ఈ రోజు రాత్రి 7.30 లోపు ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని శివసేనకు డెడ్లైన్ విధించారు. దీంతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ తమ తమ పార్టీ నేతలతో కీలక చర్చలు జరుపుతున్నాయి.