రాముడు అయోధ్యలోనే జన్మించాడన్న హిందువుల విశ్వాసం నిర్వివాదాంశం: సుప్రీంకోర్టు
- తీర్పు చదువుతోన్న గొగోయ్
- మసీదును ఎవరు, ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని హైకోర్టు చెప్పింది
- రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందింది
ఈ కేసు దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న హిందూ భక్తుల కోసం ఉద్దేశించిందని గొగోయ్ అన్నారు. ఇది వ్యక్తిగత హక్కుల కోసం దాఖలు చేసిన వ్యాజ్యం కాదని చెప్పారు. మసీదును ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని ఇప్పటికే హైకోర్టు చెప్పిందని తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందన్నారు.