ప్రియాంక గాంధీ ఫోన్ నూ వదలని ఇజ్రాయెల్ స్పైవేర్
- ప్రముఖుల ఫోన్లు హ్యాకైనట్టు వాట్సాప్ వెల్లడి
- ప్రియాంక ఫోన్ కు కూడా వాట్సాప్ సందేశం
- వెల్లడించిన కాంగ్రెస్ వర్గాలు
హ్యాకింగ్ కు గురైన వారికి వాట్సాప్ సందేశాలు పంపగా, ఆ సందేశం అందుకున్నవారిలో ప్రియాంక కూడా ఉన్నారని సూర్జేవాలా తెలిపారు. ఇది ప్రభుత్వం చేయిస్తున్న హ్యాకింగ్ అని ఆయన మండిపడ్డారు. స్పైవేర్ పేరుతో నిఘా చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ స్పైవేర్ వాట్సాప్ లో ఆడియో/వీడియో కాల్స్ వ్యవస్థలో ఉన్న ఓ లోపాన్ని ఆసరాగా చేసుకుని ఫోన్లలో ప్రవేశిస్తున్నట్టు గుర్తించారు.