వివాదాస్పద జీవో 2430పై ఏపీలో ఆగ్రహ జ్వాలలు.. జర్నలిస్టుల రాష్ట్రవ్యాప్త నిరసనలకు టీడీపీ మద్దతు
- జీవో 2430ను రద్దు చేసే వరకు పోరాడతామన్న చంద్రబాబు
- రాష్ట్రవ్యాప్త నిరసనలకు జర్నలిస్టు సంఘాల పిలుపు
- ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక
కాగా, నేడు రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించాలని, ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతిపత్రాలు అందజేసి, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐవీ సుబ్బారావు, చందు జనార్దన్‌లు పిలుపునిచ్చారు. జీవోను ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.