పాక్ రైలులో అగ్ని ప్రమాదం: 62కి చేరిన మృతుల సంఖ్య
- కోడి గుడ్లు ఉడకపెట్టడానికి గ్యాస్ వెలిగించిన ప్రయాణికులు
- ఈ కారణంగానే మంటలు?
- ప్రమాదంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విచారం
ప్రయాణికుల్లో కొందరు కోడి గుడ్లు ఉడకపెట్టడానికి గ్యాస్ వెలిగించారని, ఈ కారణంగానే మంటలు చెలరేగాయని సమాచారం. అగ్నిమాపక దళాలు, ఆర్మీ సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విచారం వ్యక్తం చేశారు. గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.