వైసీపీకి రాజీనామా... కీలక నిర్ణయం తీసుకోనున్న దగ్గుబాటి!
- వైసీపీలో కొనసాగుతున్న దగ్గుబాటి
- ఆయన భార్య పురందేశ్వరి బీజేపీలో
- వైసీపీని వీడాలని దగ్గుబాటి ఫ్యామిలీ నిర్ణయం
- నేడో, రేపో రాజీనామా లేఖ
కాగా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి పురందేశ్వరి, బీజేపీలో కొనసాగుతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జగన్, ఉంటే ఇద్దరూ ఒకే పార్టీలో ఉండాలని దగ్గుబాటిని హెచ్చరించినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో పర్చూరు నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ గా దగ్గుబాటిని, ఆయన కుమారుడిని కాదని రామనాథం బాబును ఎంపిక చేయడం ఆయన అనుచరుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది.
దీంతో శనివారం నాడు దగ్గుబాటి తన అనుచరులతో సమావేశం కాగా, వైసీపీ అధిష్టానం వైఖరిపై నిరసన వ్యక్తమైంది. తమ నేతను అవమానించారని దగ్గుబాటి అనుచరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పర్చూరులో వైసీపీ ఓడిపోవడానికి రామనాథం కారణమని, ఆయన్ను ఇన్ చార్జ్ గా చేస్తే అంగీకరించబోమని తేల్చి చెప్పారు.