రవితేజ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఖరారైపోయింది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవితేజ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఖరారైపోయింది

  • రవితేజా తాజా చిత్రంగా 'డిస్కోరాజా'
  • తదుపరి సినిమా గోపీచంద్ మలినేనితో 
  • నిర్మాతగా 'ఠాగూర్' మధు
ప్రస్తుతం రవితేజ .. వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' సినిమా చేస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నారు. రవితేజ సరసన పాయల్ - నభా నటేశ్ నటిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా తరువాత రవితేజ ఏ దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడనేది ఆయన అభిమానులకు ఆసక్తికరంగా మారింది.

రవితేజ తన తదుపరి చిత్రాన్ని ఫలానా దర్శకుడితో చేయనున్నాడంటూ కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ చివరికి గోపీచంద్ మలినేని ప్రాజెక్టు ఖాయమైపోయింది. దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, కొంతసేపటి క్రితం ఈ విషయాన్ని అధికారికంగా తెలియపరుస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. 'ఠాగూర్' మధు నిర్మిస్తున్న ఈ సినిమా, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
Raviteja

More Telugu News