మా ఆటగాళ్లు టీ10 లీగ్ లో ఆడరు: పీసీబీ
- గతంలో ఇచ్చిన అనుమతి ఉపసంహరణ
- ఆటగాళ్లపై పనిభారం పెరుగుతుందనే... ఈ నిర్ణయం
- మాజీ ఆటగాళ్లకు మినహాయింపు
‘ఆటగాళ్ల ఫిట్ నెస్ ను దృష్టిలో ఉంచుకుని వారిపై పనిభారం పెరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాము. మా ఆటగాళ్లు దేశవాళీ క్వాద్ ఈ అజామ్ టోర్నీలో పాల్గొనాల్సి ఉంది’ అని పీసీబీ తెలిపింది. గతంలో ఈ లీగ్ లో పాల్గొనేందుకు ఆటగాళ్లను అనుమతించినప్పటికీ ఆటగాళ్లపై ఒత్తిడి పెంచకూడదన్న కారణంగా తాము నిర్ణయం మార్చుకున్నామని పీసీబీ వెల్లడించింది. అయితే మాజీ ఆటగాళ్లపై ఎటువంటి నిబంధనలు లేవని పేర్కొనడంతో షాహిద్ అఫ్రిది ఇతర మాజీలు ఈ లీగ్ లో పాల్గొననున్నారు.