'రాజుగారి గది 3' తొలిరోజు షేర్
- నిన్న విడుదలైన 'రాజుగారి గది 3'
- రెండేళ్ల గ్యాప్ తరువాత చేసిన అవికా
- అశ్విన్ పై ఓంకార్ ఆశలు
తొలి రోజున నైజామ్ లో 42 లక్షలు .. సీడెడ్ లో 24 లక్షలు .. వైజాగ్ లో 16 లక్షలు .. గుంటూరులో 14 లక్షలు .. తూర్పుగోదావరిలో 10 లక్షలు .. కృష్ణా జిల్లాలో 9 లక్షలు పశ్చిమ గోదావరిలో 6 లక్షలు .. నెల్లూరులో 4 లక్షలను వసూలు చేసింది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత అవికా ఈ సినిమా చేయడం విశేషం. ఇక ఈ సినిమాతో అశ్విన్ హీరోగా నిలదొక్కుకుంటాడనే ఆశాభావాన్ని ఓంకార్ వ్యక్తం చేస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.