అయోధ్య తీర్పు కోసం యావత్ భారతం ఎదురుచూపులు.... విదేశీ పర్యటన రద్దు చేసుకున్న రంజన్ గొగొయ్
- అయోధ్య కేసులో తీర్పు ప్రకటించాలన్న ఉద్దేశంతో నిర్ణయం!
- నవంబర్ 17న పదవీ కాలం పూర్తి
- ఈలోగా తీర్పు వెలువరించే అవకాశం
ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన 14 పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మొత్తం నలబై రోజులపాటు వాద ప్రతివాదనలు విన్నది. మరో పక్క గొగొయ్ పదవీ కాలం వచ్చే నెల 17న పూర్తి కానుండటంతో... అంతకు ముందే చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించాలని గొగొయ్ ఉత్సుకతతో ఉన్నారు.