బీజేపీని గెలిపిస్తే పాకిస్థాన్‌పై అణుబాంబు పడినట్టే: యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్
- ఈ ఎన్నికలు మీ దేశభక్తికి నిదర్శనం
- 370 రద్దు నేపథ్యంలో మీ మద్దతు అవసరం
- మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ సందర్భంగా మాట్లాడుతూ జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న 370 ఆర్టికల్‌ను రద్దు చేసిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో, ఈ ఎన్నికల్లో బీజేపీకి మీ మద్దతు చాలా అవసరమన్నారు. ఈ ఎన్నికలు మీలోని దేశభక్తిని తెలియజేస్తాయని చెప్పారు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే పాకిస్థాన్‌పై అణుబాంబు పడినట్టేనని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో అక్టోబరు 21న ఎన్నికలు జరగనున్నాయి.