అయోధ్యలో ఆంక్షలు... 144 సెక్షన్ విధింపు
- సుప్రీంలో రామ జన్మభూమి కేసు విచారణ నేపథ్యం
- దసరా సెలవుల తర్వాత నేటి నుంచి విచారణ
- ఈనెల 17న తీర్పు
ఈనెల 16తో హిందూ వర్గాల వాదనలు ముగించాలని అత్యున్నత న్యాయ స్థానం నిర్ణయించింది. మరుసటి రోజు ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. ఇక అదే రోజున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ విరమణ కూడా చేయనున్నారు.
అతి సున్నితమైన ఈ కేసులో విచారణ చివరి దశకు చేరడం, తీర్పు వెలువడనుండడంతో ఆంక్షలు విధించామని, డిసెంబరు 10 వరకు ఆంక్షలు కొనసాగుతాయని అయోధ్య జిల్లా కలెక్టర్ (మేజిస్ట్రేట్) తెలిపారు.