'రాజుగారి గది 3'లో తమన్నాను అందుకే తీసుకోలేదట!
- కామెడీ పాళ్లు పెంచేశాము
- నా పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది
- అవికా చాలా బాగా చేసిందన్న అశ్విన్
ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో అశ్విన్ మాట్లాడుతూ, 'రాజుగారి గది 2' సినిమాలో కామెడీ పాళ్లు తగ్గాయనే విమర్శ వచ్చింది. అందువలన ఈ సినిమాలో కామెడీ డోస్ ఎక్కువగానే ఉండేలా చూశాము. ఈ సినిమాలో నా పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది. మరో కీలకమైన పాత్ర కోసం ముందుగా తమన్నాను అనుకున్నప్పటికీ, ఆమె డేట్స్ కుదరకపోవడం వలన అవికా గోర్ ను తీసుకున్నాము. ఈ పాత్రకి అవికా కరెక్ట్ అనిపించింది" అని చెప్పుకొచ్చాడు.