జానారెడ్డికి తొలిసారి ఓటమి చూపించిన ఘనుడు... మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ కన్నుమూత!
- 72 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూత
- నల్గొండ జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకునిగా పేరు
- సంతాపం తెలిపిన పలువురు నేతలు
రామ్మూర్తి యాదవ్ అంత్యక్రియలు రేపు ఉదయం స్వగ్రామమైన త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో జరుపుతామని కుటుంబీకులు తెలిపారు. రామ్మూర్తి మరణ వార్తను తెలుసుకున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తదితరులు సంతాపాన్ని వెలిబుచ్చారు.