ఉత్కంఠకు తెరదించిన టీడీపీ నేత గంటా శ్రీనివాస్!
- గంటా పార్టీని వీడుతారని వార్తలు
- నేడు టీడీపీ సమావేశానికి హాజరైన గంటా
- ఆయన పార్టీ మారబోరంటున్న టీడీపీ నేతలు
అయితే, ఇవన్నీ పుకార్లేనని గంటా ఇటీవల ప్రకటించినా, ఆయనపై వస్తున్న వార్తలు మాత్రం ఆగలేదు. తాజాగా నేడు ఉత్తర నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. పార్టీ నేతలు, స్థానిక కార్యకర్తలతో పలు విషయాలపై చర్చించారు. దీంతో ఈ సమావేశానికి గంటా హాజరవుతారా? లేదా? అన్న ఉత్కంఠకు తెరపడింది. ఇదే సమయంలో ఆయన పార్టీలో కొనసాగే అంశంపైనా స్పష్టత వచ్చేసిందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.