జైషే మహ్మద్ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్న కశ్మీర్ పోలీసులు
- ఉగ్రవాది నుంచి ఆయుధాలు స్వాధీనం
- భద్రతా బలగాలకు భారీ విజయం
- జైషే సమాచారం తెలుసుకునే అవకాశం
ఓ టెర్రరిస్టును సజీవంగా బంధించడం భద్రతా బలగాలకు వ్యూహాత్మక విజయం అని చెప్పాలి. అతడి అరెస్టు ద్వారా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కీలక సమాచారం రాబట్టే అవకాశం ఇప్పుడు భారత్ ముందు నిలిచింది. ఓ ప్రమాదకర ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడం పట్ల జమ్మూకశ్మీర్ పోలీసులపై అభినందనల వర్షం కురుస్తోంది.