రూ. 750 కోట్లు తగ్గించామంటూ రూ. 7500 కోట్ల నష్టం చేకూర్చారు: చంద్రబాబు

26-09-2019 Thu 15:28 | Andhra
  • పోలవరం పనులకు మేఘా గతంలో ఎక్కువ కోట్ చేసింది
  • క్విడ్ ప్రోకోలో భాగంగానే ఇప్పుడు తక్కువ కోట్ చేసింది
  • ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి క్విడ్ ప్రోకో జరిగింది
పోలవరం ప్రాజెక్టులో దోపిడీకి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 750 కోట్లు ఆదా చేశామని చెప్పుకుంటూ... రూ. 7500 కోట్ల నష్టాన్ని చేకూర్చారని చెప్పారు. పోలవరం పనులకు గతంలో ఎక్కువ కోట్ చేసిన మేఘా సంస్థే ఇప్పుడు తక్కువ ధరను కోట్ చేసిందని తెలిపారు. ఎలెక్ట్రిక్ బస్సులకు సంబంధించి క్విడ్ ప్రోకోలో భాగంగానే ఇది జరిగిందని ఆరోపించారు.

మేఘా కంపెనీకి ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవంటూ సురేంద్రబాబు అడ్డుపడితే... ఆర్టీసీ ఎండీ పదవి నుంచి ఆయనను తప్పించారని విమర్శించారు. గోదావరిలో మునిగిన బోటును ఇంతవరకు తీయలేకపోయారని... ఓ ప్రైవేటు సంస్థ ముందుకు వచ్చినా, దానికి అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. తిరుమలను వివాదాలకు కేంద్రంగా మార్చారని చెప్పారు. అన్నింటిపై పోరాడుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ChandrababuPolavaramTelugudesamYSRCP

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more