బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు విద్యార్థి సంఘం నుంచి బెదిరింపులు

25-09-2019 Wed 12:33 | National
  • ఫేస్‌బుక్‌లో ఈ మేరకు పోస్టింగ్‌
  • నీకు ఉరిశిక్ష రెడీగా ఉందంటూ హెచ్చరికలు
  • ఈనెల 27న విచారణకు రానున్న కృష్ణజింకను వేటాడిన కేసు
బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌పై పంజాబ్ విద్యార్థి సంఘం ఫేస్‌బుక్‌ వేదికగా బెదిరింపులకు పాల్పడుతుండడం చర్చనీయాంశమైంది. ‘సల్మాన్‌...నీకు ఉరిశిక్ష రెడీగా ఉంది. నువ్వు తప్పించుకోలేవు’ అంటూ పెట్టిన పోస్టింగ్స్‌పై చర్చ సాగుతోంది.

వివరాల్లోకి వెళితే... 1990ల్లో ఓ సినిమా చిత్రీకరణ సమయంలో జోధ్‌పూర్ అడవుల్లో కృష్ణజింకను వేటాడినట్టు సల్మాన్‌తో పాటు ఆ సమయంలో అతనితో ఉన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రేలపై కేసు నమోదయ్యింది. జోధ్‌పూర్ న్యాయస్థానం విచారణలో సల్మాన్ ఒక్కరే దోషిగా తేలారు. ఆయనకు ఐదేళ్ల కారాగార శిక్ష పడింది. దీంతో జైలుపాలైన సల్మాన్ ఒక రోజు జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో గడిపాడు. మరునాడు ఆయనకు కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో బయటికి వచ్చాడు.

ఎప్పుడో జరిగిపోయిన సంఘటన కాబట్టి తనపై వేసిన కేసును మరోసారి పరిశీలించి కొట్టివేయాలని ఈ ఏడాది జులైలో జోధ్‌పూర్‌ సెషన్స్ కోర్టులో సల్మాన్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ఈ నెల 27న విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ యూనివర్శిటీకి చెందిన స్టూడెంట్ ఆర్గనైజేషన్ తమ ఫేస్‌బుక్ లో ఓ పోస్టు పెట్టింది.

‘సల్మాన్... భారతీయ చట్టం నుంచి నువ్వు తప్పించుకోగలననుకుంటున్నావేమో. బిష్ణోయ్ సమాజ్, పంజాబ్ యూనివర్శిటీ స్టూడెంట్ ఆర్గనైజేషన్‌లు నీకు ఎప్పుడో ఉరిశిక్షను ఖాయం చేశాయి. నువ్వు మా కోర్టులో దోషివి. నీకు శిక్ష తప్పదు' అని ఆ పోస్టింగ్ లో పేర్కొన్నారు. ఇంకా  'అమ్మాయిలను గౌరవించు. జంతువులను రక్షించు. డ్రగ్స్‌కి దూరంగా ఉండు. పేదలకు సాయం చేయడం అలవాటు చేసుకో’ అని కూడా రాశారు. ఈ బెదిరింపులతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
Salman Khankrishna jinkapunjab student organizationwarning

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more