టీడీపీ హయాంలో విశాఖను అభివృద్ధి చేయకపోగా దోచుకున్నారు: వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్
- భూ కుంభకోణాలతో చంద్రబాబు అండ్ కోటరీ దోచుకుంది
- పులివెందుల వ్యక్తులు వసూళ్లకు పాల్పడటం అబద్ధం
- జగన్ పాలనలో విశాఖకు మంచిరోజులు వస్తాయి
సీఎం జగన్ పాలనలో విశాఖకు మంచిరోజులు రాబోతున్నాయని చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికే పత్రికలు భరించలేకపోతున్నాయని ధ్వజమెత్తారు. ఈ విషయమై విశాఖ నగర కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. విశాఖను అభివృద్ధి చేసింది నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు.