అందుకే అజయ్ భూపతికి రవితేజ నో చెప్పాడట
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే అజయ్ భూపతికి రవితేజ నో చెప్పాడట

  • రవితేజతో సినిమా ప్లాన్ చేసిన అజయ్ భూపతి 
  • ఫస్టాఫ్ నచ్చిందన్న రవితేజ 
  • సెకండాఫ్ పట్ల అసంతృప్తి
'ఆర్ ఎక్స్100' వంటి సూపర్ హిట్ తరువాత, రవితేజ కథానాయకుడిగా 'మహా సముద్రం' సినిమాను రూపొందించాలని దర్శకుడు అజయ్ భూపతి అనుకున్నాడు. అయితే ఆ తరువాత అజయ్ భూపతి చేసిన ఒక ట్వీట్ తో, ఈ సినిమాను ఆయన రవితేజతో చేయడం లేదనే విషయం చాలామందికి అర్థమైపోయింది. దాంతో కారణమేమిటనే విషయాన్ని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని కనబరుస్తూ వస్తున్నారు.

అజయ్ భూపతి చెప్పిన 'మహా సముద్రం' కథలో ఫస్టాఫ్ నచ్చిందని చెప్పిన రవితేజ్, సెకండాఫ్ లో కొన్ని మార్పులు చెప్పాడట. ఆ మార్పులు చేయడానికి అజయ్ భూపతి ఒప్పుకోలేదని సమాచారం. ఇలా వుంటేనే బాగుంటుందని అజయ్ భూపతి చెప్పడంతో, మార్పులు చేయకపోతే తను చేయడం కష్టమేనని రవితేజ అన్నాడట. ఈ కారణంగానే ఈ ప్రాజెక్టు నుంచి రవితేజ తప్పుకున్నాడని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.
Raviteja

More Telugu News