చంకలు గుద్దుకోవడం కోసమే.. మతలబు అర్థమవుతోంది: లోకేశ్

22-09-2019 Sun 07:46 | Andhra
  • మ్యాక్స్ ఇన్‌ఫ్రాపై గతంలో సాక్షిలో వచ్చిన వార్తను పోస్టు చేసిన లోకేశ్
  • అప్పుడు ఉట్టికి ఎగరలేని సంస్థ.. ఇప్పుడు స్వర్గానికి ఎలా ఎగురుతుందని ప్రశ్న
  • ఒక్క శాతం కూడా పనులు చేయని సంస్థకు పనులా?
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ మరోమారు విమర్శలు గుప్పించారు. ‘పోలవరం కుడి అనుసంధానం టన్నెల్‌లో మంత్రి మాయాజాలం’ అంటూ గతంలో సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తను తన ట్విట్టర్ ‌ఖాతాలో పోస్టు చేసిన లోకేశ్.. వైసీపీ నేతల తీరు చూస్తుంటే ‘ఆలూ లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. గతంలో  గతంలో 4.77 శాతం ఎక్కువ టెండర్‌కు మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా సంస్థ పనులు దక్కించుకుందని, ఇప్పుడు అవే పనులను 15.60శాతం తక్కువకు బిడ్‌ వేసిందంటేనే మతలబు ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు.

రూ.58 కోట్లు మిగిల్చామని చంకలు గుద్దుకోవడం కోసమే ఇలా చేస్తున్నారా? అని లోకేశ్ ప్రశ్నించారు. అప్పుడు  ఉట్టికి ఎగరలేనమ్మ ఇప్పుడు స్వర్గానికి ఎగురుతుందా? అని నిలదీశారు. మార్చిలో పనులు దక్కించుకుని ఒక్క శాతం పనులు కూడా పూర్తిచేయలేకపోయిన సంస్థకు ఇప్పుడు పనులు అప్పగించడం విడ్డూరంగా ఉందని లోకేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Nara LokeshYSRCPpolavarammax infra

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more