నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యర్థి వర్గాల ఘర్షణ.. భయంతో పరుగులు తీసిన సిబ్బంది!
- ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘటన
- ఈరోజు గోస్పాడులో కొట్టుకున్న రెండు వర్గాలు
- గాయాలతో ఆసుపత్రికి వచ్చాక మళ్లీ ఘర్షణ
దీంతో వీరిని బంధువులు, కుటుంబ సభ్యులు నంద్యాల గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రిలో తమ ప్రత్యర్థులను చూడగానే ఇరువర్గాలు మళ్లీ రెచ్చిపోయాయి. ఏది కనబడితే దాన్ని తీసుకుని దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఆసుపత్రిలోని డ్రెస్సింగ్ రూమ్ ధ్వంసం కాగా, వైద్య సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. క్షతగాత్రులకు చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.