టీడీపీ కార్యకర్త సలీమ్ పై దాడి.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన కేశినేని నాని!
- కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో ఘటన
- టీడీపీ కార్యకర్త సలీమ్ పై ప్రత్యర్థుల దాడి
- వైసీపీ గూండాలే చేశారన్న కేశినేని నాని
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సలీమ్ ను ఆయన పరామర్శించారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ తాతయ్యతో కలిసి కేశినేని సలీమ్ ను పరామర్శించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన కేశినేని నాని.. ఈ దాడి ఘటనకు సంబంధించిన వార్తా పత్రికల కథనాలను పోస్ట్ చేశారు.