చిత్తూరు జిల్లాలో ఘోరం.. దగ్ధమైన కారు.. ఐదుగురి సజీవ దహనం
- బెంగళూరు నుంచి పలమనేరు వైపు వెళ్తుండగా ఘటన
- బోల్తాపడడంతో కారులో చెలరేగిన మంటలు
- మామడుగు సమీపంలో ఘటన
ఆ వెంటనే కారులో మంటలు చెలరేగడంతో కారులోని ప్రయాణికులు బయటకు రాలేక మంటలకు ఆహుతయ్యారు. ఒకరు మాత్రం తీవ్ర గాయాలతో బయటపడగలిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.