‘ఛలో ఆత్మకూరు’లో వివాదం.. నన్నపనేని కులం పేరుతో దూషించారని మహిళా ఎస్సై ఆగ్రహం!
- చంద్రబాబు నివాసం వద్ద 144 సెక్షన్
- టీడీపీ మహిళా నేతలతో కలిసి వచ్చిన నన్నపనేని
- దళితులంటూ దూషించారని ఎస్సై ఆరోపణ
‘ఏం అన్నారు మీరు? మేం దళితులమా? పబ్లిక్ సర్వెంట్లం మేము. మేం దళితులమా మీకు? ఆమె వేలు చూపించి చెబుతుంటే మీరు(టీడీపీ మహిళా నేతలు) మొత్తం చూస్తున్నారు. కష్టపడి మేం ఉద్యోగం సాధించాం. మీలాగా కాదు. ఏందయ్యా. ఏంటి చెప్పు. ఏం మాట్లాడుతున్నావ్. ఆమె(నన్నపనేని రాజకుమారి) ఏం చెప్పింది? ఎమ్మెల్యేగా, మహిళా కమిషన్ చైర్మన్ గా పనిచేసింది. మేము దళితులమా? మీడియా మొత్తం చూస్తుండగా వేలు చూపిస్తారా?’ అంటూ నిప్పులు చెరిగారు. దీంతో అప్పటివరకూ ఉత్సాహంగా ఉన్న నన్నపనేని రాజకుమారి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.