ఆర్మీ చీఫ్ తో కలసి నియంత్రణ రేఖ వద్ద పర్యటించిన ఇమ్రాన్ ఖాన్
- పాకిస్థాన్ రక్షణ, అమరవీరుల దినోత్సవం సందర్భంగా పర్యటన
- వెంట ఆర్మీ చీఫ్, పలువురు మంత్రులు
- సైనిక బలగాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం
పాకిస్థాన్ రక్షణ, అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్వోసీ వద్ద వీరు పర్యటించారు. సరిహద్దుల వద్ద భారత్ నుంచి ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పాక్ సైనికబలగాలు సిద్ధంగా ఉండాలని కొన్ని రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తాజాగా నియంత్రణ రేఖ వద్ద పర్యటించాలని ఇమ్రాన్ నిర్ణయించారు.