ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లో ఉద్యోగం పోయిందని.. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించిన యువకుడు!
- ఆంధ్ర్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఘటన
- ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న వీరకుమార్ రెడ్డి
- ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించిన యాజమాన్యం
దీంతో గుంటూరు పట్టణంలోని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కార్యాలయం వద్దకు చేరుకున్న వీరకుమార్ రెడ్డి తన ఒరిజినల్ సర్టిఫికెట్లను చించిపడేశాడు. అనంతరం వెంట తెచ్చుకున్న ల్యాప్ టాప్ ను నేలకేసి కొట్టి ధ్వంసం చేశాడు. బట్టలన్నీ విప్పేసి ట్రస్ట్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి ప్రయత్నించాడు. దీంతో సెక్యూరిటీ ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకోగా, వారితోనూ దురుసుగా ప్రవర్తించాడు. చివరికి అధికారులు వీరకుమార్ రెడ్డిని గుంటూరులోని సర్వజనాసుపత్రికి తరలించగా, అక్కడ మానసిక చికిత్స విభాగంలో చేర్పించారు. అయితే బాధితుడు సహకరించకపోవడంతో బలవంతంగా మత్తు మందు ఇచ్చిన డాక్టర్లు అతడిని నిద్రపుచ్చారు.