ఏపీ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాసిన టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు!
- విశాఖ భూ కుంభకోణం నివేదికను బయటపెట్టండి
- సిట్ విచారణను పున:ప్రారంభించండి
- ఏపీ ముఖ్యమంత్రిని కోరిన గంటా
విశాఖ భూ కుంభకోణం వెనుక ఎవరు ఉన్నారో ప్రజలకు తెలపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గంటా శ్రీనివాసరావు తెలిపారు. తాను మంత్రిగా ఉండగా సిట్ నివేదికను బయటపెట్టాలని కోరారనీ, అయినా బయటపెట్టలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ నివేదికలోని విషయాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు గంటా శుభాకాంక్షలు తెలిపారు.