ఏపీని నాన్న నడిపించిన తీరు జాతీయస్థాయిలో తెలుగువారిని గర్వపడేలా చేసింది!: సీఎం జగన్
- నేడు వైఎస్సార్ 10వ వర్థంతి
- నివాళులు అర్పించిన ఏపీ సీఎం
- వైఎస్ నిర్ణయాలు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయని వ్యాఖ్య
రాష్ట్రాన్ని వైఎస్ నడిపించిన తీరు జాతీయస్థాయిలో తెలుగు ప్రజలను ఎంతో గర్వించేలా చేసిందని వ్యాఖ్యానించారు. నాన్న భౌతికంగా దూరమైనా పథకాల రూపంలో బతికే ఉన్నారని చెప్పారు. ఆయనిచ్చిన స్ఫూర్తి మనల్ని ఎప్పటికీ విలువలబాటలో నడిపిస్తూనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు.