పోలీసులకు చిక్కకుండా పారిపోయిన టీడీపీ నేత కూన రవికుమార్... ప్రత్యేక టీమ్ ల ఏర్పాటు!
- ఎంపీడీఓను దుర్భాషలాడిన కూన
- పలు సెక్షన్ల కింద కేసు నమోదు
- ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు
ప్రత్యేక పోలీసుల టీమ్ వీరిని అరెస్ట్ చేసేందుకు ఆముదాలవలసకు రాగా, మొత్తం నిందితులందరూ పరారీలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. కాగా, కూన రవికుమార్, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మిగతా నిందితుల కుటుంబ సభ్యులను ప్రస్తుతం విచారిస్తున్న పోలీసులు, వారి ఆచూకీ తెలుసుకునేందుకు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు.