జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డు
- టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్ గా రికార్డు
- 11 టెస్టుల్లోనే ఈ ఘనత అందుకున్న బుమ్రా
- ఇప్పటివరకు షమీ, వెంకటేశ్ ప్రసాద్ పేరిట ఉన్న రికార్డు
- 13 టెస్టుల్లో 50 వికెట్లు తీసిన షమీ, వెంకీ
ఇప్పటివరకు ఈ రికార్డు మహ్మద్ షమీ, వెంకటేశ్ ప్రసాద్ ల పేరిట ఉంది. షమీ, వెంకీ ఇద్దరూ కూడా 13 టెస్టుల్లో 50 వికెట్లు సాధించారు. అయితే 25 ఏళ్ల బుమ్రా వీరికంటే రెండు టెస్టులు తక్కువగా ఆడి ఈ ఘనత నమోదు చేశాడు. ప్రస్తుతం వెస్టిండీస్ తో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బుమ్రా ప్రత్యర్థి బ్యాట్స్ మన్ డారెన్ బ్రావోను అవుట్ చేయడం ద్వారా 50వ వికెట్ ను ఖాతాలో వేసుకున్నాడు.