పదోసారి తాతయ్య అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
- సోమవారం అర్ధరాత్రి పాపకు జన్మనిచ్చిన లారా ట్రంప్
- ఎరిక్-లారా దంపతులకు ఇది రెండో సంతానం
- కరోలినా డోరితిగా నామకరణం
73 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్‌కు ముగ్గురు భార్యల ద్వారా ఐదుగురు సంతానం. వీరిలో మొదటి ఇద్దరు డొనాల్డ్ జూనియర్, ఇవాంకా ట్రంప్. మూడో సంతానం ఎరిక్. ట్రంప్ ఆర్గనైజేషన్‌లో తన సోదరుడు డొనాల్డ్ జూనియర్‌తో కలిసి ఎరిక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. ఇక, 36 ఏళ్ల లారా ట్రంప్ మాజీ జర్నలిస్ట్. ట్రంప్ 2020 రీఎలక్షన్ ప్రచారంలో సీనియర్ అధికారిగా ఉన్నారు.