దున్నపోతు తోకయినా ఆడిస్తుంది.. కానీ తెలంగాణ సర్కారు మొద్దునిద్ర పోతోంది!: రేవంత్ రెడ్డి ఆగ్రహం
- తెలంగాణలో ప్రబలిన విష జ్వరాలు
- గత 3 నెలల్లో 43 లక్షల కేసులు నమోదు
- ట్విట్టర్ లో ప్రభుత్వంపై మండిపడ్డ రేవంత్
దున్నపోతుపై వాన పడితే అది కనీసం తోక అయినా ఆడిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రమంతా జ్వరాలతో అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర పోతుందా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన రేవంత్ రెడ్డి.. ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని తన ట్వీట్ కు జతచేశారు.