రష్యా మంత్రిని వెంటాడిన నాటో యుద్ధ విమానం... వెంటనే వచ్చి రక్షణనిచ్చిన ఫైటర్ జెట్లు!
- నాటో విమానాన్ని చూసిన రాడార్లు
- వెంటనే దూసుకెళ్లిన రష్యా ఫైటర్ జెట్లు
- మంత్రిని క్షేమంగా మాస్కోకు చేర్చిన వైనం
నాటో వినియోగంలో ఉన్న ఎఫ్-18 జెట్ సెర్గి షోయిగు విమానానికి దగ్గరగా వెళ్లిందని, రష్యాకు చెందిన ఎస్యూ-27లు దాన్ని దూరంగా తరిమేసేందుకు దూసుకెళ్లాయని అదే విమానంలో మంత్రితో పాటు ప్రయాణిస్తున్న 'టాస్' విలేకరి తన కథనంలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా 'టాస్' విడుదల చేసింది. దూరంగా నాటో యుద్ధ విమానం కనిపిస్తుండగా, దానికి, మంత్రి ప్రయాణిస్తున్న విమానానికి మధ్య రక్షణగా రష్యన్ జెట్ నిలిచినట్టు తెలుస్తోంది. కొత్త మిలిటరీ అకాడమీకి శంకుస్థాపన చేసేందుకు మంత్రి వెళుతున్న వేళ ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం ఘటనపై నాటో ఇంకా అధికారికంగా స్పందించలేదు.