రక్తపాతానికి కారణమైన ‘370’ పరిసమాప్తమైంది: అమిత్ షా
- ఆర్టికల్ 370 రద్దు చేస్తే ప్రపంచం మునుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు
- ఈ బిల్లు రద్దుపై కొంత మంది నిజాలు దాచిపెట్టారు
- రాజ్యసభలో అమిత్ షా
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన కష్టనష్టాలపై చాలామంది ఏకరవు పెట్టారని, దీన్ని రద్దు చేస్తే ప్రపంచం మునుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారని విమర్శించారు. ఈ బిల్లు రద్దుపై కొంత మంది నిజాలు దాచిపెట్టారని మండిపడ్డారు. ఆర్టికల్ 370 కారణంగా.. పెద్ద పర్యాటక సంస్థలు పెట్టుబడులు పెట్టడం లేదని, పాక్ నుంచి భారత్ వచ్చిన శరణార్థులకు దేశ వ్యాప్తంగా ఓటు హక్కు వచ్చింది కానీ, ఆ శరణార్థులకు జమ్ముకశ్మీర్ లో మాత్రం ఓటు హక్కు రాలేదని అమిత్ షా అన్నారు.